విజయమ్మ భేటీ: జెడి తీరును తప్పుపట్టిన బర్ధన్

సిపిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ తీరు అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు. సిబిఐని రాజకీయాలకు వాడడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తు వివరాలను లక్ష్మినారాయణ మీడియాకు ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. ఒక వర్గం మీడియాకు లక్ష్మినారాయణ లీకులు ఇవ్వడం సరైన చర్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు
ఏమైనా సమాచారం ఉంటే లక్ష్మినారాయణ కోర్టుకు సమర్పించాలి గానీ మీడియాకు లీకుల రూపంలో విడుదల చేయడం సరి కాదని ఆయన అన్నారు. లక్ష్మినారాయణ తీరుపై ప్రధాని మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకోవాలని, ఇటువంటివి తిరిగి జరగకుండా చూడాలని ఆయన కోరారు. విజయమ్మ వెంట పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సీనియర్ నేత మైసురా రెడ్డి, శాసనసభ్యులు శోభా నాగిరెడ్డి, సుచిరత తదితరులు ఉన్నారు.
ఓ వర్గం మీడియాకు లీకులు ఇవ్వడంపై లక్ష్మినారాయణ వివరణ ఇవ్వాలని బర్దన్ అన్నారు. కాగా, విజయమ్మ విమర్శలపై ఎఐసిసి ప్రతిస్పిందించింది. జగన్‌పై జరుగుతున్న విచారణతో తమ పార్టీకి సంబంధం లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. కోర్టు ఆదేశాల మేరకే జగన్ అక్రమాస్తులపై సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, వైయస్ విజయమ్మ గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపి చీఫ్ శరద్ పవార్‌ను కలుస్తారు. సివిసిని కూడా ఆమె కలుస్తారు. శరద్ పవార్‌కు రాష్ట్రంలోని రైతుల కష్టాలను కూడా ఆమె వివరించనున్నారు. జగన్‌పై సిబిఐ విచారణ జరుగుతుండగా వైయస్ విజయమ్మ ప్రధానిని కలవడం వల్ల ప్రయోజనం లేదని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు.












Click it and Unblock the Notifications