జైలులో జగన్‌ను కలిసిన వైయస్ భారతి, నల్లపురెడ్డి

ఎరువులు, విత్తనాలు, బ్యాంక్ రుణాలు అందక రాష్ట్ర రైతాంగం పడుతోన్న తీవ్ర ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి న్యూఢిల్లీలో తెలిపారు. శరద్ పవార్‌తో వైయస్ విజయమ్మ బృందం భేటీ కానుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించడం అత్యంత దురదృష్టకమని మైసూరా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రివ్యూ మీటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప రైతుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాలని శరద్ పవార్‌కు విజ్ఞప్తి చేయనున్నట్టు మైసూరా రెడ్డి తెలిపారు.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు శరద్ పవార్‌ను, సాయంత్రం ఐదు గంటలకు సివిసి ప్రదీప్ కుమార్‌ను కలవనున్నారు. మరోవైపు వైయస్ జగన్‌కు బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications