వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎజెండా: జైపాల్ రెడ్డితో లగడపాటి భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy-Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కలుసుకున్నారు. తెలంగాణపై చర్చించడానికే ఆయన జైపాల్ రెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెసు అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లగడపాటి జైపాల్ రెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాదని, సమైక్యాంధ్రనే కేంద్రం ప్రకటిస్తుందని లగడపాటి రాజగోపాల్ గురువారం మరోసారి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో లగడపాటి జైపాల్ రెడ్డితో ఏం మాట్లాడారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అంశంపై జైపాల్ రెడ్డి బయటకు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.

ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రేపు శుక్రవారం ఢిల్లీకి వస్తున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు జరుగుతున్న కసరత్తులో భాగంగానే పార్టీ అధిష్టానం వారిని ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం గత కొద్దిరోజులుగా రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులతో తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. సోనియా కూడా మూడు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను విన్నారు. రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ కూడా పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించారు.

తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇటీవల చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు అభిప్రాయం కోసం రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీలు ఎదురు చూస్తున్నాయని, కాంగ్రెసు అభిప్రాయం ప్రకటించిన తర్వాత తమ అభిప్రాయం చెప్పాలనే ఉద్దేశంతో ఆ పార్టీలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. దీంతో ఇతర పార్టీలను పక్కన పెట్టేసి తమ నిర్ణయాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ అంశం మరోసారి తెర మీదికి వచ్చింది. అయితే, రాయలసీమకు చెందిన నాయకులు చాలా మంది ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ నాయకులు కూడా దానికి అంగీకరించడం లేదు.

English summary
Congress Vijayawada MP Lagadapati rajagopal has met the union minister from Telangana region S Jaipal Reddy and discussed on Telangana issue. It is said that Congress high command is preparing to announce its stand on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X