గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను విడిపించేందుకే: వైయస్ విజయమ్మపై కోడెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodela Siva Prasad Rao
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలు నుండి విడిపించేందుకే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, పార్టీ నేతలు ఢిల్లీ పర్యటన చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద్ గురువారం గుంటూరులో అన్నారు. ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా గుంటూరు ప్రచారంలో వైయస్ విజయమ్మ తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు.

కానీ ఆమె తన ఢిల్లీ పర్యటనలో అదే అనుమానాన్ని ఎందుకు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీతో లాలూచీ కోసమే వారి ఢిల్లీ పర్యటన అని ఆరోపించారు. రైతు సమస్యల ముసుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఫ్యాక్షనిస్టు అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో సానుభూతితోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించిందని బుధవారం తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివ ప్రసాద్ హైదరాబాదులో అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన విశ్లేషణ అనంతరం ఆన విలేకరులతో మాట్లాడారు.

2014లో ఈ పరిస్థితి రాదని చెప్పారు. అభివృద్ధే కొలమానంగా ఎన్నికలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించామని కార్యకర్తలు ఇచ్చిన సలహాలు సూచనలతో గెలుపు దిశగా ముందుకు సాగుతామని చెప్పారు.

English summary
Telugudesam Party senior leader Kodela Siva Prasad said that YSR Congress party honorary president and Pulivendula MLA YS Vijayamma delhi tour for release party chief and Kadapa MP YS Jaganmohan Reddy from Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X