రాజకీయం చేయొద్దు: జోగి, నిలిపివేయాల్సిందే.. హరీష్

వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్లే నీటి సమస్య తలెత్తిందని, తాగునీటికి, నారుమళ్ల కోసం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరామని సీమాంధ్ర ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ జోగి రమేష్ తెలిపారు. డెల్టాకు నీటిని విడుదల చేయవద్దనటం రైతాంగం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమేనని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
సీమాంధ్ర పాలకులకు అవకాశమిస్తే నీళ్లనే కాదు... తెలంగాణ ప్రజల కన్నీళ్లను కూడా తరలించుకుపోతారని తెలంగాణ రాష్ట్ర సమితి ఉపనేత, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఎద్దేవా చేశారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కోదాడలో బుధవారం నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.
కృష్ణా డెల్టాకు నీటి విడుదలను తక్షణం నిలిపివేయకుంటే సాగర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో తెలంగాణపై ప్రేమ కనబర్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయలక్ష్మి ఇప్పుడు మాట్లాడరేమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications