మెడికల్ సీట్ల రాజకీయం: కోస్తాంధ్ర వర్సెస్ తెలంగాణ

వైద్య విద్య శాఖా మంత్రిగా ఉత్తరాంధ్రకు చెందిన కొండ్రు మురళి ఉన్నారు. దీంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. తెలంగాణలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యపై అదే పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ విరుచుకుపడ్డారు. లగడపాటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన శుక్రవారం అన్నారు. లగడపాటి విభేదాలు పెంచుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణోలని వైద్య కళాశాలలు 150 సీట్లను కోల్పోయినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై తాను కేంద్ర వైద్య శాఖ మంత్రి ఆజాద్‌ను కలిసినట్లు ఆయన తెలిపారు.
కొండ్రు మురళిపై హైదరాబాద్‌కు చెందిన మంత్రి దానం నాగేందర్ విరుచుకుపడ్డారు. మెడికల్ సీట్ల కేటాయింపు తీరు అభ్యంతరకరంగా ఉందని ఆయన శుక్రవారం అన్నారు. ఓ సామాజిక వర్గానికి, ఓ ప్రాంతానికి చెందిన కళాశాలలకు మాత్రమే మెడికల్ సీట్లు కేటాయించారని ఆయన అన్నారు. ఇందుకు మంత్రి కొండ్రు మురళి జవాబు చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. తెలంగాణలో మెడికల్ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు శుక్రవారం హైదరాబాదులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగిందని తెరాస నాయకుడు శ్రవణ్ అన్నారు.
కాగా, ఈ రగడపై వైద్య విద్య మంత్రి కొండ్రు మురళి వివరణ ఇచ్చారు. తమ రాష్ట్రానికే ఎక్కువ సీట్లు వచ్చాయని ఆయన చెప్పారు. చిన్ని చిన్న కారణాల వల్ల కొన్ని కళాశాలలకు భారత వైద్య మండలి (ఎంసిఐ) సీట్లు కేటాయించలేదని ఆయన శుక్రవారం అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సీట్లు పెంచాలని తాము ఎంసిఐని కోరామని, అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెంపునకు ఎంసిఐ అంగీకరించిందని ఆయన చెప్పారు. అన్యాయాన్ని సరిదిద్దాలని తాము ఆజాద్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications