వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంప్రదాయాలను మరువొద్దు: బోనమెత్తిన జయసుధ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాలను మరువొద్దని సికింద్రాబాద్ శాసనసభ్యురాలు, ప్రముఖ సినీ నటి జయసుధ హితబోధ చేశారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... రాబోయే కాలంలో మన సంప్రదాయాలను మరువకూడదని సూచించారు. మహంకాళీ బోనాల జాతరకు ఏటికేడు భక్తులు పెద్ద ఎత్తున పెరుగుతున్నారని చెప్పారు.

ఈ బోనాల జాతరకు తాను రావడం ఇది మూడోసారి అని చెప్పారు. స్థలం చిన్నగా ఉన్నప్పటికీ అందరూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శికుంటున్నారని చెప్పారు. పోలీసు డిపార్టుమెంటుతో సహా అన్ని డిపార్టుమెంట్‌లకు సహకరించి ఇలాగే ప్రశాంతంగా కొనసాగాలని అన్నారు. ప్రజలను ఆశీర్వదించి, వారంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని తాను అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.

జిహెచ్ఎంసి మాజీ చైర్మన్ బండ కార్తీక రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. వచ్చే సంవత్సరం విఐపిలకు ఓ ప్రత్యేక సమయం కేటాయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. విఐపిల వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వచ్చే సంవత్సరం లోగా దీనికి పరిష్కారం చూపిస్తామన్నారు.

అంతకుముందు ఉదయం మర్రి శశిధర్ రెడ్డి బోనాల జాతరను ప్రారంభించారు. అమ్మవారికి హారతి ఇచ్చి ఆయన బోనాల పండుగను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

English summary
Secunderabad MLA and cine actor Jayasudha suggested about our traditions. She was offered prayers at Secunderabad Ujjain Mahankali Ammavaru on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X