వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలోకి నాని: ఖండించిన జూనియర్ ఎన్టీఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు కొడాలి నాని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ జగన్ పార్టీలో చేరాలనే నిర్ణయంపై తెలుగు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నాని నిర్ణయాన్ని ఆయన ఖండించారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన సోమవారం మాట్లాడారు. నాని నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొడాలి నాని నిర్ణయంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.

తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. నానితో గత కొంత కాలంగా టచ్‌లోనే లేనని, నానిని గత కొంత కాలంగా దూరం పెడుతున్నానని ఆయన చెప్పారు. తనకు, కొడాలి నాని నిర్ణయంతో సంబంధం అంటగట్టకూడదని ఆయన అన్నారు. గుడివాడ శానససభ సీటును కొడాలి నానికి ఇప్పించడంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. పార్టీని కొడాలి నాని వీడడం దారుణమని ఆయన అన్నారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. కొడాలి నాని నిర్ణయం వెనక తన పాత్ర ఉండవచ్చుననే అనుమానాలు రేకెత్తకుండా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినట్లు కనిపిస్తోంది.

నాని జగన్ పార్టీలో చేరాలనే నిర్ణయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఇప్పటికే ఖండించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళుతున్న కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సోమవారం చెప్పారు. నాని తనకు అనుచరుడు కాదన్నారు. నానితో తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని చెప్పారు. కేవలం సినిమా పరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయన్నారు.

తెలుగుదేశం పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడు. వంశీ విజయవాడలో రోడ్డుపై వైయస్ జగన్‌ను కలుసుకోవడంపై కూడా దుమారం చెలరేగింది. ఆ దుమారంపై జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత ప్రతిస్పందించారు. నాని విషయంలో మాత్రం వెంటనే ప్రతిస్పందించారు. నిజానికి, గత కొంత కాలంగా నానితో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నట్లు ఇటీవల వార్తాకథనాలు కూడా వచ్చాయి.

English summary
Nandamuri hero Jr NTR has condemned Telugudesam Gudivada MLA Kodali Nani's secission to quit party and join in YS Jagan's YSR Congress party, He said that he is not having links with Jodali Nani since few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X