వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకూ కొడాలి నాని షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr - Hari Krishna
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కేవలం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకే కాదు.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన తనయుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్‌కూ షాక్ ఇచ్చారని అంటున్నారు. రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేని నానిని హరికృష్ణ రాజకీయాలలోకి తీసుకు వచ్చినట్లుగా వాదనలు ఉన్నాయి. 2004 సాధారణ ఎన్నికల సమయంలో హరికృష్ణ ప్రోద్బలంతోనే నాని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1999లో కూడా అన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు హరికృష్ణ నానికి అండగా నిలిచారు.

ఆ తర్వాత 2009 సాధారణ ఎన్నికల సమయంలోనూ గుడివాడ టిక్కెట్ నానికి ఇప్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా వాదనలు ఉన్నాయి. ఇలా రాజకీయాల్లోకి రావడానికి కారణమైన హరికృష్ణకు, 2009లో టిక్కెట్ రావడానికి కారణమైన జూనియర్ ఎన్టీఆర్‌కూ ఝలక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. నాని కూడా జగన్ కలిసిన అనంతరం మాట్లాడుతూ టిడిపి, జూనియర్ ఆరోపణలపై త్వరలో స్పందిస్తానని చెప్పారు.

అయితే కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన చిక్కుల్లో పడి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పలుమార్లు నందమూరి - నారా కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. విభేదాలు వచ్చినప్పుడుల్లా నాని యువహీరో జూనియర్ వైపు నిలిచారు. దమ్ము చిత్రం సమయంలో జరిగిన ఘర్షణలోనూ నాని ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు. అలాంటి నాని ఇప్పుడు టిడిపిని వీడటం కారణంగా జూనియర్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తనకు మంచి సన్నిహితుడిగా ముద్ర పడటంతో నాని అంశంపై జూనియర్ సోమవారం మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో జూనియర్ నాని పట్ల తన అసంతృప్తిని వ్యక్తపర్చారు. నాని పార్టీ మార్పు వెనుక తాను లేనని, ఆయన వెళ్లే ముందు తనతో సంప్రదించలేదని చెప్పారు. తాను చచ్చేంత వరకు టిడిపిలోనే ఉంటానని చెప్పారు. మరోవైపు టిడిపి నేతలు కూడా ఈ వ్యవహారం వెనుక జూనియర్, హరికృష్ణల పాత్ర లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి ఎన్టీఆర్ ఈ వివాదంపై వివరణ ఇచ్చి ఇంతటితో ముగింపు పలికారనే భావించవచ్చు.

English summary
Hero Junior NTR put end to Gudiwada of Krishna 
 
 district MLA Kodali Nani issue with his 
 
 clarification on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X