లగడపాటి ఇంటిపై కోడిగుడ్లు: తెలంగాణ లాయర్ల ధర్నా

Lagadapati Rajagopal
హైదరాబాద్: మెడికల్ సీట్ల వ్యవహారంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదుల ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని లగడపాటి ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో అక్కడకు చేరిన కొందరు లగడపాటి ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు.

వారిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తెలంగాణకు ఎక్కువ వైద్య సీట్లను కేటాయించారంటూ లగడపాటి అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలు మానుకోవాలని న్యాయవాదులు సూచించారు. తమకు జరిగిన అన్యాయం పట్ల ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని కానీ, రాజగోపాల్ దీనికి వక్రభాష్యం చెబుతున్నారని వారు మండిపడ్డారు. కాగా మెడికల్ సీట్ల వ్యవహారంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

కాగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. తెలంగాణలో తెరాస వాదానికి ఆదరణ తగ్గిందని అన్నారు. ఎంబిబిఎస్ సీట్లు సీమాంధ్రలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్నారు. హరీష్ రావు తప్పుడు లెక్కలతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొడుతున్నారన్నారు.

దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎంబిబిఎస్ సీట్లపై హరీష్ రావుది అర్థం లేదని వాదన అన్నారు. తెలంగాణలో ఎక్కువ సీట్లు ఉన్నట్లు తాను గణాంకాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తప్పని తేలితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తప్పుడు లెక్కలు చూపించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని తెరాసకు హితవు పలికారు. కెసిఆర్ ఓ పైశాచికుడు అని, దుర్మార్గమైన వేర్పాటు వాది అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వాతిముత్యంలో కమల్ హాసన్‌లా తెలంగాణపై నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వేర్పాటువాదంపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేర్పాటువాదాన్ని అణిచివేయడంలో సఫలమయ్యారన్నారు.

కిరణ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఎప్పటికీ విడిపోదని, సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. కాగా మెడికల్ సీట్ల వ్యవహారంపై లగడపాటి తెరాస అధినేత కెసిఆర్‌కు ఓ లేఖ రాశారు. సీమాంధ్రలో కంటే తెలంగాణలోనే మెడికల్ సీట్లు ఎక్కువగా ఉన్నాయని, గణాంకాలతో సహా నిరూపిస్తానని, తప్పని తేలితే రాజీనామా చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+