చంద్రబాబును నమ్మలేం: వంద సీట్ల హామీపై చిరంజీవి

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెసు శాసనసభ్యులంతా ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాదులో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. ఈ నెల 18వవ తేీదన కాంగ్రెసు శానససభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపడుతున్న ఇందిరమ్మ బాటను స్వాగతిస్తున్నామని ఆయన బుధవారం విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. తెలంగాణపై స్పష్టత ఇస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ వస్తుంది, ఉద్యమాలు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావే చెబుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తుందని తమకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రైతు సమస్యలపై విలువైన సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. సలహాలు ఇవ్వడానికి బదులు ధర్నాలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications