నో ట్రాన్స్‌ఫర్: కేసులు తేలేదాకా ఇక్కడే లక్ష్మీనారాయణ

లక్ష్మీ నారాయణ బదలీ జరగవచ్చని వస్తున్న ఊహాగానాలకు స్పందిస్తూ ఢిల్లీ సిబిఐ ప్రధాన కార్యాలయానికి చెందిన అధికారులు మంగళవారం మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన లక్ష్మీ నారాయణ ఐదేళ్ల పాటు డిప్యుటేషన్‌పై మన రాష్ట్రానికి వచ్చారు. 2012 జూన్ నాటికే ఆయన డిప్యూటేషన్ పూర్తయినప్పటికీ మరో రెండేళ్లు పొడిగించారు.
ఈయన బదలీ కావచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొందరు మీడియా ప్రతినిధులు ఢిల్లీలోని సిబిఐ ఉన్నతాధికారులను సంప్రదించారు. కేసుల దర్యాఫ్తు పూర్తయ్యే వరకు లక్ష్మీ నారాయణ అక్కడే కొనసాగుతారని వారు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతున్న కేసులకు అత్యంత ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా ఆయనను రాష్ట్రం నుంచి కదిలించే ప్రసక్తి లేదని ఉన్నతాధికారులుస్పష్టం చేశారు.
కాగా ఇటీవల లక్ష్మీనారాయణను అప్రతిష్ఠ పాలు చేసేందుకు జరిగిన కుట్రను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ నారాయణ కాల్ లిస్టు సేకరించి న వ్యవహారంలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్త కూడా ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. దీంతో వారి పాత్రనూ బయటపెట్టాలని సిబిఐ యోచిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ ఫోన్ కాల్సు జాబితాను బహిర్గతం చేయడంపై నమోదైన కేసును సవాల్ చేస్తూ కె.రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ ఈ నెల 13వ తేదికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications