కెసిఆర్ మాటలకు విలువ లేదు: రేణుకా చౌదరి

Renuka Chowdary
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాటలకు విలువ లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కెసిఆర్ చేసిన ప్రకటనపై ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. కెసిఆర్ అభిప్రాయాలపై తాను వ్యాఖ్యానించబోనంటూనే ఆమె ఆ మాటలన్నారు. తెలంగాణపై ఉద్యమాలు చేయవద్దనే కెసిఆర్ అభిప్రాయం మంచిదేనని ఆమె అన్నారు.

తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం ఉందని, తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణపై ఏదో ఒక రోజు నిర్ణయం ప్రకటించాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగడానికి తనకు మాత్రమే వీసా ఉందని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పర్యటించడానికి తనకు వీసా ఉందని ఆమె అన్నారు. తెలంగాణపై కెసిఆర్ ప్రకటనతో తమ పార్టీకి సంబంధం లేదని ఆమె అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికతో తమ పార్టీ నాయకత్వం తీరిక లేకుండా ఉందని, రాష్ట్రపతి ఎన్నిక తర్వాతనే తెలంగాణపై ఆలోచన చేస్తుందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతోందనేది ఊహాగానాలు మాత్రమేనని ఆమె అన్నారు. రాష్ట్రానికి చెందిన నాయకులతో తమ పార్టీ నేత రాహుల్ గాంధీ సమావేశం కావడంలో విశేషం ఏమీ లేదని, రాష్ట్ర నాయకులు రాహుల్ గాంధీని కలుసుకోవడం మామూలేనని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పరిస్థితులపై అభిప్రాయాలు సేకరిస్తున్నారని ఆమె చెప్పారు.

తెలంగాణపై భాగస్వామ్య పక్షాలతోనూ చర్చలు జరుపుతున్నట్లు రేణుకా చౌదరి చెప్పారు. వివిధ సంస్థల ద్వారా కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు ఆమె తెలిపారు

కాంగ్రెసు నేత రాహుల్ గాంధీని హైదరాబాద్ మాజీ మేయర్ బండారు కార్తీకరెడ్డి బుధవారం ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ - రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ దృష్టి పెట్టారని, త్వరలోనే ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారని కార్తీకరెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+