టెక్కీ అమెరికా యాత్రతో అప్‌సెట్, భార్య ఆత్మహత్య

తమ కూతురు వరకట్నం వేధింపులకు బలైందని సౌమ్య తల్లిదండ్రులు సుశీల, హనుమంతరాయ అంటున్నారు. పోలీసులు విశ్వనాథ్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి వ్లల చంద్రసంద్రాకు మారాల్సి రావడంతో టీచర్ ఉద్యోగాన్ని సౌమ్య వదిలేసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఇంటి యజమాని శివకుమార్ పోలీసులకు చెప్పాడు.
తాను అటుగా వెళ్తున్నప్పుడు ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంటడం తాను చూశానని అతన చెప్పాడు. శివకుమార్ పక్క భవనంలోనే ఉంటాడు. శివకుమార్, ఇరుగుపొరుగువారు బలవంతంగా తలుపులు తెరిచి సౌమ్య దింపి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆమె సూసైడ్ నోట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దంపతులు తరుచుగా పోట్లాడుకునేవాళ్లని, ఆగస్టులో విశ్వనాథ్ అమెరికాకు వెళ్తున్నాడని తెలిసి ఆమె తీవ్ర నిరాశకు లోనైందని, తాను అతనితో వెళ్లడానికి నిరాకరించిందని శివకుమార్ పోలీసులకు చెప్పాడు. అయితే, వరకట్నం కోసం తమ అల్లుడు కూతురుని వేధించాడని సౌమ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరు వైపులా వాంగ్మూలాలు తీసుకుని కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications