తెలంగాణ: లగడపాటికి లక్ష్మణ్ బాపూజీ ఆహ్వానం

ఆ సమావేశానికి హాజరుకావాలని ఆయన లగడపాటి రాజగోపాల్‌ను ఆహ్వానించారు. తెలంగాణ కోసం పోరాడుతున్న సంఘాలు, ప్రజాసంస్థలతో పాటు సమైక్యాంధ్రను కోరుకునే వారినీ బహిరంగంగా పిలిచారు. గురువారం తన నివాసంలో కోర్‌కమిటీ సమావేశం అనంతరం విలేకరులకు వివరాలను బాపూజీ వెల్లడించారు.
ప్రజాపోరాటంతోనే తెలంగాణ రావాలన్నారు. మహబూబ్‌నగర్, పరకాల ఎన్నికల తర్వాత తెలంగాణపై కేంద్రం ధోరణిలో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ప్రత్యేకరాష్ట్రం ఇచ్చే అవకాశం ఉందన్నారు. సద్భావనతో విడిపోవాలని, విడిపోయిన తర్వాత కూడా కలసిమెలసి ఉండాలనే.. ఈ రౌండ్‌టేబుల్ సమావేశమన్నారు.
ఆగస్టు 9 క్విట్ఇండియా ఉద్యమం రోజు, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం లేదా సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం విమోచనం రోజుకల్లా తెలంగాణ ఇవ్వకుంటే స్వాతంత్య్రసమరయోధులంతా గ్రామాల్లోపర్యటించి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను భాగస్థులను చేసి తెలంగాణ సాధనకు చివరి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications