శ్రీమాన్‌కు కోర్టులో చుక్కెదురు, హీరోని చేశారన్న మంత్రి

పోలీసు అధికారి రమేష్ నేతృత్వంలో బృందం శ్రీమాన్ కోసం గాలిస్తోందని అంటున్నారు. మరోవైపు మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ... తన తనయుడిని హైలెట్ చేసి హీరోను చేసింది మీడియానే అని అన్నారు. కాగా రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య కుమారుడు శ్రీమాన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనపై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
హన్మకొండలోని మట్టెవాడలో ఎస్సై రమేష్‌ను దుర్భాషలాడినందుకు ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆదివారంనాడు మంత్రి సారయ్యకు వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారు సారయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సారయ్య కుమారుడు శ్రీమాన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి వీరంగం సృష్టించారు. ఎస్సై రమేష్‌పై తిట్ల వర్షం కురిపించారు. దీంతో రమేష్ శ్రీమాన్‌పై రాతపూర్వకమైన ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు శ్రీమాన్‌పై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయయ్యారు. ఇలాంటి సమయంలో శ్రీమాన్ ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది.












Click it and Unblock the Notifications