ఎంపి అంజన్ కుమార్ తనయుడిని ఓడించిన వంశీ

అయితే, ఫలితాలను రిటర్నింగ్ అధికారి జయశంకర్ పాటిల్ వెల్లడించలేదు. రెండు రోజుల్లో ఆయన ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వంశీచందర్ రెడ్డిపై కేసులు ఉండడం వల్లనే ఫలితాల ప్రకటనను నిలిపేసినట్లు తెలుస్తోంది. తాను ఓడిపోయినట్లు తెలిసిన వెంటనే అనిల్ కుమార్ యాదవ్ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
యువజన కాంగ్రెసు ఎన్నికల్లో 26 మంది పోటీ చేశారు. వీరిలో పది మంది యువజన కాంగ్రెసు కార్యవర్గానికి ఎన్నికయ్యారు. యువజన కాంగ్రెసు ఎన్నికల్లో హేమాహేమీల కుమారులు తలపడ్డారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తనయుడు పురువర్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
వంశీచందర్ రెడ్డి కాంగ్రెసు విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడిగా పనిచేశారు. సుమారు 3,350 ఓట్లు ఉండగా మొత్తం 26 మంది పోటీ చేశారు. రెండో స్థానం సాధించిన అనిల్ కుమార్ యాదవ్ ఉపాధ్యక్షుడు అవుతారు. మూడో స్థానంలో నిలిచిన రవి యాదవ్ ప్రధాన కార్యదర్శి అవుతారు. వంశీ చందర్ రెడ్డిపై రిలయన్స్ సంస్థలపై దాడి కేసులున్నాయి.












Click it and Unblock the Notifications