రేణుక నోట తెలంగాణ, సాధించుకుంటామని వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu
Renuka Chowdhury
హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నోట ఇన్నాళ్లకు తెలంగాణ సానుకూల వ్యాఖ్య వెలువడింది. హుందాగా, గౌరవంగా, గర్వంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటామని ఆమె అన్నారు. ఖమ్మంలో ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జోస్యాలతో తమకు సంబంధం లేదని ఆమె అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని నీరు గారుస్తోంది కెసిఆరేనని ఆమె విమర్శించారు. తెలంగాణ ఎప్పుడివ్వాలి, ఎలా ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెసు పార్టీయే నిర్ణయిస్తుందని ఆమె అన్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగమని ఆమె న్నారు. ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

తన ఎంపి కోటా నిధుల్లోని 30 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి ప్రణాళికను అమలుచ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లను ఆమె తీవ్రంగా ఖండించారు. గృహ హింస నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

రేణుకా చౌదరి ఇటీవలి కాలం దాకా తెలంగాణపై తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదు. ఒక రకంగా తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరించారు. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో తెలంగాణ వస్తుందని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తరుచుగా చెబుతూ వస్తున్నారు. దీనిపైనే రేణుకా చౌదరి స్పందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MP Renuka Chowdhury said that Telangana state will be achieve with dignity. She said that Congress high command will take decision on Telangana at appropriate time.
Please Wait while comments are loading...