హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బిసి'పై దూకుడు పెంచిన బాబు: జగన్, కిరణ్‌కు సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: బిసిలకు వంద సీట్లు ఇస్తామని ప్రకటించిన తర్వాత ఆయా వర్గాల నుండి వస్తున్న మద్దతు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం చంద్రబాబు మరోసారి బిసి గళమెత్తడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలకు సవాల్ విసిరారు. పలువురు బిసి సంఘాల నేతలు పార్టీ కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు.

సమర్థవంతమైన వారు వస్తే బిసిలకు వంద సీట్లు మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువ సీట్లు కూడా ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉందని చంద్రబాబు ప్రకటించారు. బిసి వాదనతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు భయపడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెసులో బిసిలకు ఏం న్యాయం జరిగిందో చెప్పాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బిసిల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. టిడిపి ప్రవేశ పెట్టిన బిసి డిక్లరేషన్ తర్వాత ఇప్పుడు అన్ని పార్టీల వారు దాని గురించి మాట్లాడుతున్నారన్నారు. తమ బిసి డిక్లరేషన్ పైన ఎద్దేవా చేస్తున్న వారు మా కంటే మంచి బిసి పాలసీ ప్రకటించాలని... కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసును ఉద్దేశించి సవాల్ చేశారు. మా డిక్లరేషన్ పైన మాట్లాడటం కాకుండా మీరేం చేశారో చెప్పండని ప్రశ్నించారు.

వెనుకబడిన వర్గాల సంక్షేమం విషయంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు. బిసి డిక్లరేషన్ ఎలా సాధ్యమో చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో వివిధ బిసి సంఘాల నేతలు బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu challenged CM Kiran Kumar Reddy and YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy on BC declaration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X