వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌహతి దాష్టీకం: న్యూస్ లైవ్ చానెల్ జర్నలిస్టు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Guwahati Molestation Case
గౌహతి: అస్సాంలోని గౌహతి దాష్టీకం కేసులో పోలీసులు జర్నలిస్టు గౌరవ్ జ్యోతి నియోగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19వ తేదీన గౌహతి వీధుల్లో 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచార యత్నం జరిగిన విషయం తెలిసిందే. యువతిపై దాష్టీకానికి ప్రోత్సహించాడనే ఆరోపణపై నగరానికి చెందిన న్యూస్ లైవ్ చానెల్ రిపోర్టర్ గౌరవ్ జ్యోతి నియోగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

నియోగ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును గౌవతి హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. నియోగ్‌ను అరెస్టు చేశామని, శనివారం అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని గౌహతి సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ అనంద్ ప్రకాష్ తివారి చెప్పారు. నియోగ్‌ను భంగాఘర్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఓ బార్ ముందు నియోగ్ బాలికపై దౌర్జన్యానికి పురికొల్పాడని టీమ్ అన్నా సభ్యుడు అఖిల్ గోగోయ్ ఆరోపించారు. ఈ వారం ప్రారంభంలో నియోగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. నియోగ్ బాస్, చానెల్ ఎడిటర్ - ఇన్ - చీఫ్ అతను భుయాన్ కూడా రాజీనామా చేశారు. నియోగ్ కెమెరామెన్‌తో కలిపి మొత్తం సంఘటనను చిత్రీకరించారు.

ఎడిట్ చేయని ఫుటేజ్‌ను, వీడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించింది. నియోగ్ పనిచేస్తున్న చానెల్‌ను అస్సాం మంత్రి భార్య నడుపుతోంది. దీంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అమర్ జ్యోతి కలిత కూడా అరెస్టు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కలిత పరారీలో ఉన్నారు.

English summary
Gaurav Jyoti Neog, reporter of city-based News Live channel, who had filmed the Jul 9 molestation of a 20-year-old girl here, was arrested on the charge of instigating the attack on her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X