జగన్ సిఎం అయితే మా గతేమిటి: విజయశాంతి

వైయస్ విజయమ్మ దీక్షకు పది వేల మంది పోలీసులను నియోగించారని, దానికి పెట్టిన ఖర్చు చేనేత కార్మికులకు పెడితే ఎంతో మేలు జరిగేదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ కుమ్మక్కయ్యారని, తద్వారా తెలంగాణవాదాన్ని నాశనం చేసే కుట్ర ప్రారంభమైందని, ప్రజలపై దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటేసినప్పుడే కుమ్మక్కయ్యారని తేలిపోయిందని ఆమె అన్నారు. తాము నిన్నటి వరకు సహనం పాటిస్తూ వచ్చామని, ఇదే పునరావృతమైతే రాయలసీమ నాయకులను సహించబోమని ఆమె అన్నారు.
రాయలసీమ నాయకులు అరాచాకాలకు పాల్పడుతున్నారని, ఇటువంటివారు తమకు వద్దని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు ప్రమాదకరమైన పార్టీ అని ఆమె అన్నారు. తెలంగాణ భవన్‌లోకి పోలీసులను పంపించారని, విద్యార్థులనూ నాయకులనూ కొట్టారని, తెలంగాణభవన్‌లోకి పోలీసులను పంపించి దౌర్జన్యం చేసిన సంఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమాధానం చెప్పాలని ఆమె అన్నారు.
తెలంగాణపై వైఖరి చెప్పకుండా సిరిసిల్లలో ఎలా అడుగుపెడతారని ఆమె విజయమ్మను అడిగారు. తెలంగాణ ప్రజలపై పోలీసులు దాడి చేశారని, పొలాల్లో పనులు చేసుకుంటున్న మహిళలను కూడా పోలీసులు కొట్టారని ఆమె ఆరోపించారు. తెలంగాణ ప్రజలపై కడప గూండాల దాడికి ఎవరు సమాధానం చెప్తారని ఆమె ప్రశ్నించారు. జగన్ లాంటివారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజల బతుకులు ఏమైపోతాయని, గూండాలో తెలంగాణలో తిరుగుతారని ఆమె అన్నారు. రాయలసీమ రౌడీలు వచ్చి తమను కొడతారా అని ఆమె ప్రశ్నించారు. వైయస్ విజయమ్మ దీక్ష విజయవంతమైందని చెప్పుకున్నా చెప్పుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications