పంతం నెగ్గించుకున్న విజయమ్మ: రేపు జిల్లా బంద్

YS Vijayamma
కరీంనగర్: సిరిసిల్ల నేతన్న ధర్నా విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తన పంతం నెగ్గించుకున్నారు. పలు ఆటంకాల మధ్య ఆమె కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చేరుకుని ధర్నా అయిందనిపించారు. ధర్నా కోసం సోమవారం ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆమెకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. ఆమె కాన్వాయ్‌పై తెలంగాణవాదులు రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. ముందస్తుగా పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను, విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

చేనేత కార్మికులకు తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన మేళ్లను ఆమె సిరిసిల్లలో చెప్పారు. తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె పర్యటనకు వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రకటనలు చేశారు. వైయస్ విజయమ్మ ధర్నా కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు తప్పు పట్టారు. విజయమ్మ ధర్నా వల్ల తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ పుంజుకుందని ఆయన అన్నారు.

కాగా, వైయస్ విజయమ్మ ధర్నా సందర్భంగా పోలీసుల అరెస్టులకు, లాఠీచార్జీలకు నిరసనగా రేపు మంగళవారం కరీంనగర్ జిల్లా బంద్ తలపెట్టారు. ఈ బంద్‌కు తెలంగాణ జెఎసి మద్దతు తెలిపింది. అలాగే, విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిని నిరసిస్తూ తెలంగాణలోని విద్యాసంస్థల మూసివేతకు తెలంగాణ విద్యార్థి జెఎసి పిలుపునిచ్చింది. దీనికి కూడా తెలంగాణ జెఎసి మద్దతు తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.

ఇక నుంచి తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు దెబ్బ తినే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. రాజకీయ నాయకులు తెలంగాణలో వ్యక్తిగత పర్యటనలు చేయవచ్చునని, రాజకీయ పర్యటనలు చేయదలిస్తే మాత్రం తెలంగాణపై తమ వైఖరేమిటో చెప్పాలని ఆయన అన్నారు. తమ తడాఖా ఏమిటో సెప్టెంబర్ 30వ తేదీన చూపిస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+