• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్టీఆర్ తర్వాత వైయస్, అడ్డుకున్నావస్తాం: విజయమ్మ

By Srinivas
|

YS Vijayamma
కరీంనగర్: స్వతంత్రం వచ్చాక రాష్ట్ర ప్రజానీకానికి, నేతన్నలకు ఎవరైనా ఏమైనా చేశారా అంటే ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమే చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం అన్నారు. ఆమె కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

సిరిసిల్ల నేతన్నల కోసం వైయస్ ప్రత్యేక ప్యాకేజీ పాటించారని, సిఎం రిలీఫ్ ఫండ్ నుండి నిధులు ఇచ్చి ఆదుకున్నారన్నారు. జాతి పిత మహాత్మా గాంధీ ఆదర్శంగా వైయస్ నేత దుస్తులు ధరించే వారన్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా నేత వస్తువులే ధరించే వారన్నారు. వైయస్ అమెరికా వెళ్లినా ఖద్దరు దుస్తులు ధరించి చేనేతకు వన్నె తీసుకు వచ్చారన్నారు. ఆయన వేషధారణను అబ్దుల్ కలాం, జార్జిబుష్ మెచ్చుకున్నారన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో ఆయన మామ ప్రవేశ పెట్టిన జనతా వస్త్రాలను తీసి వేశారన్నారు. రైతుల ఆత్మహత్యలను కూడా కించపర్చారన్నారు. జగన్ ధర్మవరంలో చేనేత కార్మికుల కోసం దీక్ష చేపట్టారన్నారు. జ్వరంతో కూడా ఆయన ఆ దీక్షలో పాల్గొన్నారన్నారు. తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అన్యాయంగా కేసులు పెట్టి జైలులో పెట్టారన్నారు.

ఆయన బయట ఉంటే ఈ దీక్షకు ఆయనే వచ్చారన్నారు. సుప్రీం కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. జగన్ బయటకు వస్తాడని, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటారన్నారు. న్యాయం, ధర్మం తమ పక్షానే ఉందన్నారు. చేనేత ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని జగన్ అప్పుడు నిలదీశారన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతారన్నారు.

ఇప్పటికే అమ్మఒడి ప్రవేశ పెడతానని చెప్పారన్నారు. దేశంలోని నేతన్నల కోసం నూతన విధానాన్ని ప్రవేశ పెడతానని, రుణ మాఫీ చేస్తానని జగన్ ఇప్పటికే చెప్పారన్నారు. జగన్ అధికారంలోకి వస్తాడని, దివంగత వైయస్ సువర్ణ యుగం తీసుకు వస్తాడన్నారు. ప్రాంతాలకతీతంగా ఎవరు ఏ కష్టంలో ఉన్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పందిస్తుందన్నారు. పలు ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం చేపట్టడం లేదని, జగన్ బయటకు వచ్చి త్వరలో అధికారంలోకి వస్తారని, రాగానే వీటిని అన్నింటిని పూర్తి చేస్తారన్నారు.

రాష్ట్రంలో రైతులు, నేతన్నలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇందుకు కారణం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే అన్నారు. విత్తనాలు, గిట్టుబాటు ధరలు లేక, నీళ్లు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. అందుకే క్రాప్ హాలీడే కూడా ప్రకటించారన్నారు. అయినా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. పెరిగిన నూలు ధరతో నేతన్నలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెసు ప్రభుత్వం ఖజానా పెంచుకోవడానికి చూస్తుందే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో ఆలోచించడం లేదన్నారు. వైయస్ ప్రభుత్వం పన్నులు ఎప్పుడూ పెంచలేదన్నారు. కానీ కిరణ్ ప్రభుత్వంలో ఆర్టీసి టిక్కెట్ ధరలుతో సహా అన్ని ధరలు పెరుగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. తమకు తెలంగాణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

English summary
Former minister and YSR Congress party leader Konda Surekha challenged Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao on Monday about Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X