గౌహతి దాష్టీకం: కోల్‌కత్తా వద్ద ప్రధాన నిందితుడు

Kalita
గౌహతి: అస్సాంలోని గౌహతి దాష్టీకం కేసులో ప్రధాన నిందితుడు కోల్‌కత్తా సమీపంలో తల దాచుకున్నట్లు పోలీసులు కనిపెట్టారు. పబ్ సమీపంలో యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన 30 మందికి నాయకత్వం వహించినట్లు భావిస్తున్న ప్రధాన నిందితుడి ఫొటోలను పోలీసులు స్థానిక చానెళ్లలో ప్రసారమయ్యేలా చూశారు. అతన్ని పట్టిచ్చినవారికి రివార్డును కూడా ప్రకటించారు.

కేసులో ప్రధాన నిందితుడు అమర్ జ్యోతి కలిత జులై 9వ తేదీ నుంచి పరారీలో ఉన్నాడు. దాష్టీకం జరిగిన సమయంలో టీ షర్ట్ ధరించి, గుంపును రెచ్చగొడుతూ కనిపించాడు. కలిత ముంబైలో ఉన్నాడని, పోలీసులు పట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి గతవారం చెప్పారు. సంఘటనను చిత్రీకరించిన స్థానిక టీవీ చానెల్ రిపోర్టర్ గౌరవ్ జ్యోతి నియోగ్‌ను పోలీసులు గతవారం అరెస్టు చేశారు.

నియోగ్ కలితకు సన్నిహిత మిత్రుడని పోలీసులు చెబుతున్నారు. మహిళపై అత్యాచారానికి వారిద్దరు గుంపును రెచ్చగొట్టారని పోలీసులు అంటున్నారు. దాడి చేస్తున్న గుంపును అడ్డుకోలేమని భావించిన తమ రిపోర్టర్లు, సాక్ష్యం దొరుకుతుందనే ఉద్దేశంతో సంఘటనను చిత్రీకరించారని న్యూస్ లైవ్ ప్రతినిధులు అంటున్నారు.

కలిత తనను తాను జేమ్స్ బాండ్‌గా ఫేస్‌బుక్‌లో చెప్పుకున్నాడు. సంఘటన జరిగినప్పుడు వేసుకున్న ఎర్ర రంగు చొక్కానే సంఘటన జరిగినప్పుడు ధరించాడని చెబుతున్నారు. ఆచూకీని కనిపెట్టిన పోలీసులు కలితను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+