నేను రాజీ పడ్తా: యుపి సిఎం అఖిలేష్ భార్య డింపుల్

తనను తన భర్త బాగా అర్థం చేసుకుంటారని, అదే సమయంలో తాను కూడా రాజీ పడుతుంటానని డింపుల్ చెప్పారు. ముగ్గురు పిల్లల విషయంలో ఎలా వ్యవహరిస్తారని అడిగినప్పుడు తాము వారిని ఊరికి తీసుకుని వెళ్తామని, స్థానిక పిల్లలతో వారు ఆడుకుంటారని ఆమె చెప్పారు. వెంటనే అఖిలేష్ యాదవ్ జోక్యం చేసుకుని - ఇంటి వద్ద వాళ్లు కార్టూన్లు చూస్తారని, వారి పెంగ్విన్ మెడగాస్కర్ తాను ఎప్పుడూ మిస్ కానని చెప్పారు.
అఖిలేష్ యాదవ్ హిందీలో మాట్లాడడానికి ప్రాధాన్యం ఇవ్వగా, డింపుల్ ఆంగ్లంలో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ వ్యవహారాలపై అఖిలేష్ యాదవ్ కఠినమైన ప్రశ్నలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. శాంతిభద్రతలపై, భాఘ్పట్‌లో కుల పంచాయతీపై, విద్యుత్ సమస్యపై ఆయన ప్రశ్నలను ఎదుర్కున్నారు.
జాతీయ స్థాయిలో తమ ప్రాధాన్యాన్ని చాటుకోవడానికి అఖిలేష్ యాదవ్, డింపుల్ ఢిల్లీలో ఒకే చోట కనిపించారని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలిపినప్పటి నుంచి వారి ప్రాధాన్యం ఢిల్లీలో పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల పేర్లు మార్చడాన్ని అఖిలేష్ యాదవ్ సమర్థించుకున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications