భారత్ ఓ నమూనా: రాష్ట్రపతిగా ప్రణబ్ ప్రమాణస్వీకారం

ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ... రాష్ట్రపతిగా దేశానికి తన సేవలు అందిస్తానని, దేశాభివృద్ధి కోసం, దేశ ఆర్థిక రంగాన్ని మెరుగు పర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తనకు దక్కిన ఈ అత్యున్నత పదవికి తాను సదా అందరికీ కృతజ్ఞుడిని అన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో మన దేశం చాలా పురోగతి సాధించిందన్నారు. యువతకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.
మన దేశంలో ఉన్న ప్రార్థనా మందిరాలే మన దేశ సంస్కృతికి, ఔన్నత్యానికి, సమైక్యతకు నిదర్శనమన్నారు. మన దేశంలో ఆకలి చాలా అవమానకరమన్నారు. పేదరిక నిర్మూలన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రపంచం ఎంతో మారిందని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్య రాజ్యసమితి వంటి సంస్థలు పుట్టుకు వచ్చాయని, ప్రపంచ యుద్ధాలు వినాశనకరమని ప్రపంచ నేతలు తెలుసుకున్నారన్నారు.
భారత్ తన భవిష్యత్తు లక్ష్యాలను విద్యాభివృద్ధితోనే సాధించగల్గుతుందని చెప్పారు. అభివృద్ధికి అవినీతే ప్రధాన అడ్డంకి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నియంత్రుత్వానికి నూకలు చెల్లుతున్నాయని, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందన్నారు. భారతీయులు పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోగలరన్నారు. ప్రపంచ ఆధునీకరణకు మన దేశం ఓ నమూనా అన్నారు. భారత్ అందర్గతంగా, బహిర్గతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొందన్నారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. ప్రణబ్ పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications