హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మగడ్డకు నాగార్జున షిర్టీ ప్రసాదం: జైలులో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagarjuna
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున మరోసారి శుక్రవారం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను కలిశారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఆయన షిర్డీ ప్రసాదాన్ని అందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌కు మంచి జరగాలని నాగార్జున షిర్డీ ప్రసాదాన్ని అందించారు. ఇటీవలి కాలంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను నాగార్జున జైలులో కలవడం ఇది రెండో సారి. జూన్ 30వ తేదీన ఆయన జైలులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశారు.

నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్టులో ప్రముఖ సినీ నటుడు నాగార్జున పెట్టుబడులు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వాన్‌పిక్ ప్రాజెక్టును చేపట్టిన మాట్రిక్స్ ఎన్‌పోర్ట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆయన భారీగా పెట్టుబడి పెట్టినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ వాన్‌పిక్ ప్రాజెక్టుపై దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం - మాట్రిక్స్ 2010 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన మాట్రిక్స్ ఎన్‌పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీ ఎజిఎం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ వార్షిక ఆదాయవ్యయాలను రిజిస్ట్రార్ కంపెనీలకు సమర్పించంది. ఇందులో అక్కినేని నాగార్జున పేరు ఉంది. ఇందులో నాగార్జున పది రూపాయల ముఖ విలువ కలిగిన 2 లక్షల వాటాలను కలిగి ఉన్నట్లు తెలిపారు.

నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన తర్వాత తన వాటాలను వెనక్కి తీసుకోవడానికి నాగార్జున ప్రయత్నించినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది. మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, చిరంజీవిలకు 80 శాతం వాటా ఉంది. ఇందులో 30 శాతం వాటాను సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది. మాటీవీకి నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్‌గా ఉన్నారు.

English summary
Prominent Telugu actor Nagarjuna met industrialist Nimmagadda Prasad alias Matrix Prasad, who was arrested in YSR Congress president YS Jagan, at Chanchalguda jail and gave Shirdi Prasadam. Nagarjuna earlier on June 20th also met Nimmagadda Prasad at jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X