మాయా విగ్రహం ధ్వంసం: రిపేర్ చేయించిన అఖిలేష్

మాయా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముగ్గురిని కూడా పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. నిందితులు ఉత్తరప్రదశ్ నవనిర్మాణ సేన కార్యకర్తలుగా భావిస్తున్నారు. నవ నిర్మాణ సేనకు సంబంధించిన పాంప్లెట్లు సంఘటనా స్థలంలో పోలీసులు కనుగొన్నారు. అయితే పాంప్లెట్లలో ఉన్న వివరాల ప్రకారం ఆ సంస్థ కార్యకర్తలు మార్చి 15, 2012లో మాయావతి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు.
మాయావతి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉత్తర ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బిఎస్పీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యుపిలోని ఝాన్సీ, అంబేద్కర్ నగర్, ముజఫర్ నగర్, కాన్పూర్ సహా పలు చోట్ల బిఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బిఎస్పీ అఖిలేష్‌ను టార్గెట్ చేసింది. దీంతో ముఖ్యమంత్రి అఖిలేష్ వెంటనే స్పందించి మాయావతి విగ్రహాన్ని బాగు చేయించడం గమనార్హం.












Click it and Unblock the Notifications