పాక్‌ల ఇస్లాంలోకి హిందూ యువకుడు, వివాదాస్పదం

వ్యాపారమే లక్ష్యంగా దేశంలోని ఎలక్ట్రానికి మీడియా సున్నితమైన అంశానికి రంగులు అద్ది మీడియా విలువలను, విశాల భావాలను, ఇంగిత జ్ఞానాన్ని సైతం తుంగలో తొక్కిందని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మతాన్ని కూడా మసాలా వస్తువులా ఉపయోగించుకుంటోందని వ్యాఖ్యానించింది.
మతపెద్ద సహాయంతో ఈ మంగళవారం ఓ హిందూ యువకుడి మత మార్పిడిని ఓ కార్యక్రమంగా స్టూడియోలో నిర్వహించడమే కాకుండా ఆడియన్స్‌ను కూడా పాల్గొనేలా చేసి... మతం మార్చుకున్న ఆ యువకుడికి పేరు సూచించాలంటూ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని డాన్ పత్రిక తప్పు పట్టింది.
ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే మతం మార్చుకున్న యువకుడు తనకు తానుగా ఇస్లాంలోకి మారినట్లుగా లేదని, అయితే టివి చూసే వాళ్లకు మాత్రం ఈ కార్యక్రమం విభిన్నంగా కనిపించిందని, ఈ అంశం ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయాలను, అతని అధ్యాత్మిక భావాలను ప్రేక్షకులపై బలవంతంగా రుద్దుతున్నట్లుగా ఉందని రాసింది.
ఇలాంటి కార్యక్రమాలను నిలుపుదల చేయక పోవడం ద్వారా దేశంలోని అల్ప సంఖ్యక వర్గాలకు(మైనార్టీలకు) ఏం సందేశం పంపుతున్నట్లు అని ప్రశ్నించింది. ఇస్లాంలోకి మారిన యువకుడిని ఓ కార్యక్రమం ద్వారా గ్రీట్ చేయడం, కంగ్రాట్స్ చెప్పడం ద్వారా దేశంలో ఇతర అల్ప సంఖ్యాక వర్గాలు (మైనార్టీలు) ఇస్లాం ప్రజల వలే స్వేచ్ఛగా లేరనే సంకేతాలు వెళుతున్నాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications