అన్నా దీక్ష ప్రారంభం: కేంద్రం సిబిఐని పావుగా... కిరణ్

2014 ఎన్నికల నాటికి కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అన్నారు. తనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదని, ఎన్నికలలో కూడా పోటీ చేయబోనని మరోసారి చెప్పారు. తన టీమ్ సభ్యులు తన ఆరోగ్యం దృష్ట్యా దీక్ష చేపట్ట వద్దని సూచించిందని, అయితే నాలుగు వందల మంది ప్రజలు దీక్షకు దిగారని, వారిని వదిలేసి తాను దీక్ష చేపట్ట కుండా ఉండలేక పోయానన్నారు.
శనివారం కూడా తన టీమ్ సభ్యులు దీక్ష మానుకోవాలని సూచించారన్నారు. తనకు ప్రజల మద్దతుందన్నారు. తాను జన్ లోక్‌పాల్ బిల్లు తెచ్చే వరకు పోరాటం చేస్తానని, ఈ దేశ ప్రజలు తనను చావనివ్వరన్నారు. దీక్ష ప్రారంభం సందర్భంగా హజారే భారత్ మాతాకీ జై, వందే మాతరమ్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారు.
లోకపాల్ బిల్లు పరిధిలోకి సిబిఐని తీసుకు రావాల్సి ఉందని కిరణ్ బేడీ అన్నారు. కేంద్రం సిబిఐను తమ పావుగా ఉపయోగించుకుంటోందని, జన్ లోక్‌పాల్ బిల్లు వచ్చి, దాని పరిధిలోకి సిబిఐ వస్తే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందన్నారు. కాగా అన్నా మరో ముగ్గురు తమ టీమ్ సభ్యులతో కలిసి దీక్షను చేపట్టారు.












Click it and Unblock the Notifications