మళ్లీ చీకట్లో ఉత్తరాది: పదిహేను రాష్ట్రాలలో కరెంట్ కట్

15 States in Dark as Northern-Eastern grid fails again
న్యూఢిల్లీ: ఉత్తరాది పవర్ గ్రిడ్ మరోసారి ఫెయిల్ అయింది. ఉత్తరాది పవర్ గ్రిడ్ కుప్ప కూలడంతో మంగళవారం ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఓడిషా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మొత్తం చీకట్లో మునిగిపోయాయి. ఈస్టర్న్ పవర్ గ్రీడ్‌లో కూడా తీవ్ర అంతరాయం రావడంతో ఈశాన్య రాష్ట్రాలకు విద్యుత్ బెడద తప్పలేదు. దీంతో ఉత్తరాది పవర్ గ్రిడ్ విఫలమవడం గత 24 గంటలలో రెండోసారి.

సోమవారం కూడా పవర్ గ్రిడ్ విఫలమవడంతో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు దాదాపు మొత్తం పది వరకు చీకట్లో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా దాదాపు పదిహేను రాష్ట్రాలు అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ స్తంభించడంతో ఢిల్లీ, కోల్‌కతా నగరాలలో మెట్రో రైళ్లు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. దాదాపు 75 రైళ్ల రద్దయ్యాయి. విద్యుత్ కొరత ఎక్కువగా మెట్రో రైళ్ల పైనే ప్రభావం చూపుతోంది. ఉత్తరాది ఎక్కడికి అక్కడ స్తంభించి పోయింది.

కాగా దీనిని పునరుద్ధరించేందుకు ఆరు నుండి ఎనిమిది గంటలు పట్టే అవకాశముంది. జల విద్యుత్ అడుగంటడం కూడా విద్యుత్ గ్రిడ్ కుప్పకూలడానికి కారణం. ఉత్తరాది గ్రిడ్ విఫలంపై మంత్రి షిండే మాట్లాడుతూ.. తాము సమస్య పరిష్కారం కోసం చూస్తున్నామన్నారు. ఈ గ్రిడ్ ఫెయిల్యూర్ మధ్యాహ్నం 1.07 నిమిషాలకు అయింది.

ఉత్తరాది పవర్ గ్రిడ్ 35,000 మెగావాట్ల కంటే ఎక్కువగా విద్యుత్‌ను సప్లై చేస్తుంది. పంజాబ్, రాజస్తాన్, ఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఎక్కువగా ఈ గ్రిడ్ ద్వారా సరఫరా చేసే విద్యుత్‌నే వినియోగిస్తారు. కాగా 100 మెగావాట్ల విద్యుత్‌ను ఢిల్లీలోని వివిఐపిల ప్రాంతాలకు సమకూరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+