జగన్‌కు 14వరకు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగింపు

ఈ మూడు కేసులలో అరెస్టైన జగన్‌ను, నిమ్మగడ్డ ప్రసాద్‌ను, మోపిదేవి వెంకటరమణను, గాలి జనార్ధన్ రెడ్డిని, విజయ రాఘవను తదితరులను కోర్టు విచారించింది. ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మీ మాత్రమే కోర్టు విచారించలేదు. మిగిలిన అందరినీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి 14 వరకు రిమాండును పొడిగించింది.
కాగా జగన్ గత మే 27వ తేదిన అరెస్టయిన విషయం తెలిసిందే. గాలి గత సంవత్సరం అరెస్టయ్యారు. అప్పటి నుండి ఈ కేసులలో వరుసగా నిందితులు అరెస్టవుతున్నారు. ఈ మూడు కేసులలోనూ సిబిఐ ఇప్పటికే కోర్టులో పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.
జగన్ ఆస్తుల కేసులో మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసిన సిబిఐ మరో పది దాఖలు చేయనుంది. అక్రమాస్తుల కేసులోని ప్రతి ఛార్జీషీటులోను ఎ-1గా జగన్‌ను, ఎ-2గా విజయ సాయి రెడ్డిని సిబిఐ నిందితులుగా పేర్కొంటోంది. తదుపరి ఛార్జీషీట్లలో కూడా అలాగే పేర్కోనుంది.












Click it and Unblock the Notifications