• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేను స్పోర్ట్స్ పర్సన్‌ని, నేరుగా ఎదుర్కుంటా: సిఎం

By Pratap
|

Kiran Kumar Reddy
హైదరాబాద్: తాను స్పోర్ట్స్ పర్సన్‌ని అని, ప్రతి అంశాన్ని నేరుగా ఎదుర్కోవడానికి స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌తో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రీడల్లో గెలిస్తే సంతోషం కలుగుతుందని, ఓడిపోతే రేపు ఎలా గెలవాలనే అంశంపై ఆలోచన ఉంటుందని, అంతే తప్ప నిరాశానిస్పృహలకు చోటు ఉండనది ఆయన అన్నారు. జయాపజయాలను ఒకే మాదిరిగా స్వీకరించే స్ఫూర్తి ఉంటుందని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా కుత్పుల్లాపూర్ మండలం సూరారం క్రాస్ రోడ్డు వద్ద ఆయన బుధవారం ఉదయం మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇబిసి వర్గాలుక చెందిన అర్హులైన 25 లక్షల మంది విద్యార్థులకు యేటా రూ.3,500కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్ రూపేణా ప్రభుత్వం చెల్లిస్తోందని, నియమ నిబంధనలకు లోబడి ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగానికి ఎంపికయ్యే విధంగా బోధన ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం కేవలం ఇంజనీరింగ్ కళాశాలలకే యేటా రూ. 1700 కోట్లు ఇస్తున్నప్పటికీ 25 నుంచి 30 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు కావడం శోచనీయమని ఆయన అన్నారు.

ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిర్వహిస్తూ అటు సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా, మరిన్ని కొత్త పథకాలతో పటిష్టంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగు క్యాడర్ ఉంటే ఈ ఒక్క ఏడాదే 1.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఆయన చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లోని పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లతో చదువు నిలివిపేసినవారికి శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ యువకిరణాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అయితే దీని కింద 17 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో 1.07 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉండడం అశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. దశలవారీగా వారందరికీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి నేరుగు ప్లేస్‌మెంట్ చేయడం జరుగుతోందని, ఇప్పటికే 2 లక్షల మందికి ఉపాధి కల్పించామని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది రెండు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు వైద్య విద్య శాఖ మంత్రి కొండ్రు మురళి చెప్పారు. పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ, శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్, సంస్థ చైర్మన్ మల్లా రెడ్డి తదితరులు ప్రసంగించారు.

English summary
N.Kiran Kumar Reddy, Chief Minister has addressed the gathering after inaugurating the Malla Reddy Institute of Medical Sciences at Maisammagu​da Village, Quthbullap​ur Mandal, Ranga Reddy District today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X