నెల్లూరు రైలు ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల కాదా?

రైలులోని ఎస్ - 11 బోగీలో మంటలు లేవడానికి ముందు మూడు పేలుడు శబ్దాలు విన్నట్లు కొంత మంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీన్ని బట్టి కూడా రైలు ప్రమాదం వెనక విద్రోహ చర్య ఉండవచ్చునని అనుమానించడానికి వీలు కలుగుతోందని అంటున్నారు. ఢిల్లీలో ముగ్గురు ప్రయాణికులు రిజర్వేషన్ లేకుండా రైలులో ఎక్కారని, దిగిపోవాలని చెప్పినా వారు వినలేదని ఓ టీసీ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ ముగ్గురు ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
సోమవారంనాడు నెల్లూరు సమీపంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్ -11 బోగీలో మంటలు లేచి భారీగా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. కొన్ని శవాలు గుర్తు పట్టరాకుండా కాలిపోయాయి. రైలు ప్రమాదం వెనక విద్రోహ చర్య ఉండవచ్చునని రైల్వే మంత్రి ముకుల్ రాయ్ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ డిజిపి దినేష్ రెడ్డి మాత్రం - ఇది విద్రోహ చర్య కాదని చెప్పారు.
అయితే, దర్యాప్తు పూర్తయితే అసలు కారణం తెలియదు. ఇప్పటి వరకైతే విద్రోహ చర్య కోణమే బలంగా వినిపిస్తోంది. ప్రమాదంలో ప్రయాణికులు దారుణంగా మరణించారు. మృతుల బంధువుల కడుపుకోత చెప్పనలవి కాకుండా ఉంది. మృతుల వివరాలను తెలుసుకోవడానికి అధికారులు వారు ధరించిన ఆభరణాలపై ఆధారపడ్డారు.












Click it and Unblock the Notifications