జగన్‌ను మీ చేతుల్లో పెట్టా: వైయస్ విజయమ్మ

YS Vijayamma
కడప: తన కుమారుడు వైయస్ జగన్‌ను మీ చేతుల్లో పెట్టానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పార్టీ కార్యకర్తలతో అన్నారు. వైయస్ విజయమ్మ సమక్షంలో జడ్పీటిసి బాబిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు వేల మంది బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి సహాయం పొందినవారు చాలా మంది ఇప్పుడు ముఖం చూపించడం లేదని, మీలాంటి కార్యకర్తలే జగన్‌ను ముందుకు నడిపిస్తున్నారని ఆమె అన్నారు. ధర్మం, న్యాయం మన పక్షాన ఉన్నాయని, త్వరలో జగన్ బయటకు వస్తాడని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ నెరువేరుస్తాడని తాను హామీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

కడప జిల్లా పులివెందుల ప్రాంత ఆస్పత్రిలోని ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్‌ను విజయమ్మ బుధవారం ప్రారంభించారు. స్కానింగ్ పరికరాల పనితీరును ఆమె వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె వైద్యులకు సూచించారు.

ఆ తర్వాత పులివెందులలో వెనకబడిన తరగతుల సంక్షేమ కార్యాలయానికి ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఎపి వైయస్సార్ టీచర్స్ యూనియన్ల సమాఖ్య నాయకులు వైయస్ విజయమ్మను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విజయమ్మ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+