జగన్ పార్టీని పట్టించుకోం, కెవిపి వ్యాఖ్యలు..: శైలజానాథ్

Sailajanth
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలను తాము పట్టించుకోమని మంత్రి సాకె శైలజానాథ్ శుక్రవారం అన్నారు. పలువురు కాంగ్రెసు నేతలు తమతో టచ్‌లో ఉన్నారన్న నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలపై శైలజానాథ్ స్పందించారు. వారితో టచ్‌లో ఉన్నారన్న వాదనతో తాము ఏకీభవించడం లేదని, వారి వ్యాఖ్యలను తాము పట్టించుకోవడం లేదన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ తమ పార్టీ నాయకుడే అన్నారు. ఇటీవల గాంధీ భవనంలో పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు సమావేశంలో వైయస్ ఫోటో లేదని అసంతృప్తి వ్యక్తం చేయడం ఆయన వ్యక్తిగతం అన్నారు. దాంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో విభజనపై ఎలాంటి చర్చా లేదన్నారు.

ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన సుప్రీం కోర్టు చేసిన సూచనలు ఆలోచింపదగినవి అన్నారు. రాష్ట్రంలో వృత్తి విద్యా కళాశాలలు, పాఠశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అలా చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చునని శైలజానాథ్ వివరించారు.

కాగా కెవిపి రామచంద్ర రావు మూడు రోజుల క్రితం గాంధీ భవనంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెసు నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జెసి దివాకర్ రెడ్డి, మధుయాష్కీ, వివేక్, రేణుకా చౌదరి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+