గవర్నర్ వ్యాఖ్యను తప్పు పట్టిన దేవేందర్ గౌడ్

ప్రాజెక్టుల పేరుతో మంత్రులు కోట్ల రూపాయలు దోచుకున్నారని దానిపై గవర్నర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన విమర్శించారు. ఉచితం ఆపాల్సిందేనని గవర్నర్ నరసింహన్ ఇటీవల వ్యాఖ్యానించారు. దానిపైనే దేవేందర్ గౌడ్ మండిపడ్డారు.
రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల చేతగాని తనం వల్లే గ్యాస్ రాష్ట్రం నుంచి తరలిపోయిందన్నారు. కేజీ బేసిన్‌లో గ్యాస్‌ను మహారాష్ట్రకు ఎలా కేటాయిస్తారని, రాష్ట్రంలో ఎండిపోయిన పంటలు కేంద్రానికి కనిపించడం లేదా అని దేవేందర్ గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి గ్యాస్ వాటా తగ్గించడం కుట్రపూరిత చర్యే అని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల బాధలు కనిపించడం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని దేవేందర్ గౌడ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గ్రామాల్లో అయితే 10 నుంచి 12 గంటలు విద్యుత్ కోత విధిస్తున్నారని, హైదరాబాద్‌లో ఎప్పుడూ లేని విధంగా గంటల కొద్ది విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్ కేటాయింపుపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. 2008లో నిర్ణయించిన గ్యాస్ వినియోగ విధానం ప్రకారమే రత్నగిరికి కేటాయింపులు చేసినట్లు తెలిపింది. ఎరువుల కర్మాగారానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యానే రత్నగిరికి గ్యాస్ ఇచ్చామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications