హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి బెయిల్ డీల్: గాలి సోమశేఖర రెడ్డి సరెండర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Somasekhar Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో ఆయన సోదురుడు, శాసనసభ్యుడు గాలి సోమశేఖర రెడ్డి శుక్రవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే, తనకు అందిన నోటీసులకు వివరణ ఇవ్వడానికి మాత్రమే ఆయన ఎసిబి కార్యాలయానికి వచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఆయన గత కొంతకాలంగాతప్పించుకుని తిరుగుతున్నారని వార్తలు రావడంతో ఆయన ఎసిబి కార్యాలయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన గత కొంత కాలంగా హైదరాబాదులోనే తల దాచుకున్నట్లు వార్తలు వచ్చాయి.

కర్ణాటక ప్రభుత్వం సహకరించకపోవచ్చునని భావిస్తున్న ఎసిబి సొంతంగానే ఆయనను అరెస్టు చేసేందుకు ఎసిబి ప్రయత్నాలు సాగించింది. గాలి బెయిల్ కుంభకోణం కేసులో ఎసిబి అధికారులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. జులై మూడో వారంలో సోమశేఖర రెడ్డికి ఎసిబి నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఎసిబి ముందుకు రావడానికి బదులు సోమశేఖర రెడ్డి, కంప్లి శాసనసభ్యుడు సురేష్ బాబు ఎసిబి కోర్టులో జులై 26వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

ఆ తర్వాత నాలుగు రోజులకు న్యాయవాదిని కలవడానికి హైదరాబాదు వచ్చిన సురేష్ బాబును ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. సురేష్ బాబును అరెస్టు చేయడానికి రెండు రోజుల ముందు సోమశేఖర రెడ్డి బళ్లారిలో ఓ సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిసినప్పటికీ మద్దతుదారులు తమను అడ్డుకోవచ్చునని, దాని వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చునని భావించి ఎసిబి అధికారులు సోమశేఖర రెడ్డి జోలికి వెళ్లలేదు. సోమశేఖర రెడ్డి ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ కనిపించి అకస్మాత్తుగా మాయమయ్యారు.

సురేష్ బాబు అరెస్టు తర్వాత సోమశేఖర రెడ్డి తన ఆచూకీ దొరకకుండా సెల్‌ఫోన్ వాడకాన్ని మానేశారని, గన్‌మన్‌ను వెనక్కి పంపించారని తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆయన అత్యవసరమైన పనుల కోసం ఎవరెవరి ఫోన్‌లో వాడుతూ ఎప్పటికప్పుడు స్థలాలు మారుతున్నట్లు తెలుస్తోంది.

English summary
According to sources cash-for-bail scam accused and Karnataka MLA Gali Somasekhar Reddy surrendered before ACB. He seems to be played a cat and mouse game with the Anti-Corruption Bureau (ACB) sleuths. Fearing that the ruling Karnataka government might not cooperate in his arrest, ACB sleuths are tried to nab the fugitive MLA on their own.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X