లాలూచీ ఎఫెక్టా: బెయిల్ అడగవద్దని జగన్ నిర్ణయం

ఆయన విజ్ఞప్తిని మన్నించిన కోర్టు ఓటేసేందుకు అనుమతించింది. దీంతో అతను రాష్ట్రపతి ఎన్నికలలో యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు. అయితే రేపు జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలలో మాత్రం ఓటు వేసేందుకు బెయిల్‌ను అడగ వద్దని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇందుకు పలు రకాల కారణాలు ఉండవచ్చునని చెబుతున్నారు. ప్రణబ్‌కు వోటు వేసిన తర్వాత జగన్ పార్టీపై తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేసింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారని, ఇరువురి మధ్య ఒప్పందం ఓట్ ఫర్ బెయిల్ ఒప్పందం జరిగిందని, అందులో భాగంగానే జగన్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేశారని, అప్పటి నుండే జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దర్యాఫ్తులో వేగం కూడా తగ్గిందని టిడిపి ఆరోపిస్తోంది.
ఇన్నాళ్లూ జగన్ పార్టీ టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కు అని ఆరోపించేది. అయితే రాష్ట్రపతి ఎన్నికల తర్వాత లాలూచీ అంశం తమకే ఎదురు తిరగడంతో జగన్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు. ఈ కారణంగానే లాలూచీ వ్యాఖ్యలను గట్టిగా తిప్పి కొట్టేందుకే జగన్ ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు కోర్టును కోరవద్దని నిర్ణయించుకున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications