విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఫ్యామిలీని వదలండి!: కొండా సురేఖ, కెసిఆర్‌కూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
విజయవాడ/చిత్తూరు: అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసే వ్యవహారాలు వదిలేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ సోమవారం అన్నారు. ఆమె కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె గన్నవరం విమానాశ్రయం వద్ద మాట్లాడారు.

అధికారం కోసం కాంగ్రెస్, టిడిపిలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేస్తున్నాయని మండిపడ్డారు. వైయస్ జగన్‌ను, వైయస్సార్ కాంగ్రెసును టార్గెట్‌గా చేసుకొని ప్రభుత్వం, ప్రతిపక్షం ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయన్నారు. తమ పదవులు కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయటం సరిపోతోందని ఆమె మండిపడ్డారు.

మరోవైపు సెప్టెంబర్ పదిహేనులోగా కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ సాధించకపోతే ఎదురుదాడి తప్పదని కొండా సురేఖ హెచ్చరించారు. కొండా సురేఖకు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు.

టిడిపితో కలిసి కాంగ్రెస్ దొంగాట ఆడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. తిరుపతిలో ఎన్నో సమస్యలు ఉన్నా టీడీపీ నోరు విప్పడం లేదన్నారు. కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ప్రధాన సమస్యలపై రోజూ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుపతి, తిరుమలకు నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గాలేరు-నగరి జలాలను తిరుపతికి రప్పిస్తామని చెప్పారు.

English summary
YSR Congress party leader and former minister Konda Surekha suggested Congress and Telugudesam Party to leave late YS Rajasekhar Reddy family and concentrate on public issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X