మంత్రులను ఆడిపోసుకున్న వైయస్ విజయమ్మ

సుప్రీంకోర్టులో తన కుమారుడు వైయస్ జగన్‌కి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆమె అన్నారు. "త్వరలో జగన్‌బాబు మీ వద్దకు వస్తారు" అని ఆమె స్పష్టం చేశారు. వైయస్ పాదయాత్ర సమయంలో జక్కంపూడి రామ్మోహనరావు సహకారం మరువలేనిదన్నారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు అన్యాయంగా, అక్రమంగా జగన్‌ను జైలులో పెట్టించాయని ఆమె ఆరోపించారు. జరుగుతున్నదంతా పైనుంచి దేవుడు చూస్తున్నాడని, న్యాయం మనపక్షాన్నే ఉందని, సుప్రీంకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.
ఈసందర్భంగా షెల్టన్ హోటల్‌లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో వైఎస్ విజయలక్ష్మి, ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రతి మహిళ వద్దకూ వెళ్లి ఆమె పలకరించారు. విజయమ్మను ముస్లిం మహిళలు ఆలింగనం చేసుకున్నారు.