వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుద్వారలో కాల్పులు: జాతి విద్వేషమే?మాజీ సోల్జర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

USA Map
వాషింగ్టన్: విస్కాన్సిన్ గురుద్వారలో కాల్పులకు జాతి విద్వేషమే కారణమని అమెరికా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పులను దేశీయ ఉగ్రవాదంగానే అమెరికా పరిగణిస్తోంది. ఈ కాల్పులకు పాల్పడి న శ్వేత జాతీయుడిని వేడ్ మైఖేల్ పేజ్‌గా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. అమెరికా మాజీ సైనికుడైన పేజ్.. జాతి విద్వేషంతోనే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. అతని ఒంటిపై పలు చోట్ల పచ్చబొట్లు ఉన్నాయి.

చేతిపై 9/11 అని కూడా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. కాగా పేజ్ కాల్పులను అడ్డుకొన్న ధీరుడు సత్వంత్ కలేకా(65) చివరకు అతని బుల్లెట్లకు ప్రాణాలు వదిలారు. విస్కాన్సిన్‌లోని ఓక్ క్రీక్ ప్రాంతంలోని గురుద్వారా వద్ద జరిగిన కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురికీ మత విశ్వాసం మెండేనని స్థానికులు తెలిపారు. ముష్కరులను అడ్డుకోబోయి గాయపడిన సత్వంత్ కలేకా.. ఇతరులను తీసుకుని గురుద్వారాలో ఓ గదిలో దాక్కున్నారు.

అక్కడే ఆయన ప్రాణాలు వదిలారు. గురుద్వారా సహాయ పురోహితుడు ప్రకాష్‌ సింగ్.. ఇక్కడే ఆరేడేళ్లుగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలను తీసుకొచ్చేందుకు రెండు నెలల క్రితమే ఆయన భారత్‌కు వెళ్లారు. ఇక సువేగ్ సింగ్ ఖత్రా(84) 2004లో అమెరికాకు వచ్చారు. క్రమం తప్పకుండా గురుద్వారాను సందర్శించే అందరితోనూ కలివిడిగా ఉండేవారని.. ఆయన గురించి తెలిసిన ఓ టాక్సీ డ్రైవర్ చెప్పారు.

ఈ కాల్పుల ఘటన అమెరికాలోని ఐదు లక్షల మంది సిక్కులను దిగ్భ్రమకు గురి చేసింది. కాగా గురుద్వారాపై కాల్పుల ఘటనను ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. కాగా, గురుద్వారా వద్ద కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఢిల్లీకి చెందిన సోదరులైన రంజిత్ సింగ్, సీతా సింగ్ ఉన్నారు. రంజత్ సింగ్ 16 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు రాలేదని, ఈ దీపావళి పండగకు వస్తానని చెప్పాడని.. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని మృతుని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమాయ్యారు.

English summary
Hours after releasing photo of "a person of interest" in the Wisconsin Gurudwara shooting incident, the FBI has ruled out involvement of the second suspect saying the shooting was carried out by the lone gunman Wade Michael Page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X