జైల్లో జగన్‌ను కల్సిన లక్ష్మీపార్వతి: విజయమ్మ, భారతీ

జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై ఇదే జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిశారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. అనంతరం బయటకు వచ్చిన శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మోపిదేవి తనకు మంచి మిత్రుడని, ఆయన ఆరోగ్యం, వ్యక్తిగత వ్యవహారాల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. మోపిదేవికి ప్రభుత్వం న్యాయసహాయం అందిస్తుందా అని అడిగితే సమాధానం దాటవేశారు.
కాగా రెండు రోజుల క్రితం.. కష్టాలలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలనే తాను ఉప ఎన్నికలలో ఆయనకు మద్దతు పలికానని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. వైయస్ జగన్‌కు తాను తల్లిలాంటి దానినని ఆమె చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఆదివారం ఓ వివాహానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ స్థానిక కలుగోళశాంభవి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరలేదని చెప్పారు. కష్టాలలో ఉన్న జగన్‌కు అండగా ఉండాలని ఉప ఎన్నికలలో ఆయనకు మద్దతు పలికానన్నారు. స్వర్గీయ ఎన్‌టిఆర్ తర్వాత సమర్థుడైన నాయకుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే అన్నారు.












Click it and Unblock the Notifications