యువతులు జీన్స్ ధరిస్తే దాడి చేస్తాం: వెలిసిన పోస్టర్లు

"ఆగస్టు 20 నుంచి యువతులు జీన్స్ ధరించడాన్ని నిషేధించాం. ఏ యువతైనా జీన్స్‌లో వెళుతున్నట్లు కనిపిస్తే యాసిడ్‌తో దాడి చేస్తాం'' అని వాటిల్లో రాసి ఉంది. పరిశ్రమల కోసం ప్రజలను నిర్వాసితులను చేసినా సహించేది లేదని, వాటిపై కూడా దాడి చేస్తామని ఆ సంస్థ హెచ్చరించింది. కాగా, ఈ సంస్థ పేరును వినడం ఇదే మొదటి సారని, పోస్టర్లను ఏర్పాటు చేసినవారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
దుప్పట్టా తప్పనిసరిగా వేసుకోవాలని ఆ సంఘ్ హెచ్చరించింది. జీన్స్ వేసుకుంటే తప్పనిసరిగా దుపట్టా వేసుకోవాలనే నియమాన్ని ఆగస్టు 20వ తేదీ నుంచి పాటించాలని హెచ్చరించింది. బయటివారు స్థలాలు కొనడానికి ప్రయత్నించినా, ఇక్కడ ఉద్యోగాలు చేయాలని చూసినా దాడులు చేస్తామని ఆ సంస్థ హెచ్చరించింది. పారిశ్రామికీకరణ పేర ప్రజలను భూముల నుంచి ఖాళీ చేయించినా సహించబోమని హెచ్చరించింది.
ఈ పోస్ట్రలను వేసినవారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని వారిని త్వరలోనే పట్టుకుంటామని సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ సాకేత్ కుమార్ సింగ్ చెప్పారు. చేతిరాతతో రాసి ఆ పోస్టర్లను రాంచీలో వేశారు. ఇది అల్లరి మూకల పని అయి ఉంటుందని సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications