వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుద్వారాకాల్పుల్లో బుల్లెట్‌‌కు ఎదురొడ్డి, పేజ్ తల్లి సారీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

USA Map
న్యూయార్క్: అమెరికాలోని విస్కాన్సిస్ గురుద్వారాలో కాల్పులు జరిగినప్పుడు అరవై అయిదేళ్ల గురుద్వారా అధిపతి సాద్వంత్ సింగ్ కలేకా వీరోచితంగా ఎదురొడ్డి పలువురు మహిళలు, పిల్లల ప్రాణాలు కాపాడారు. అందుకోసం ఆయన తన ప్రాణాలనే పణంగా పెట్టారు. అమెరికా మాజీ సైనికుడు, అయిన మైఖేల్ పేజ్‌ను కలేకా అడ్డుకునే సరికి అతను పార్కింగ్‌లో ఒకరిని కాల్చి చంపాడు.

కలేకా తన వద్ద ఉన్న సిక్కులు సాంప్రదాయంగా ధరించే కృపాణ్(కత్తి)తో ఫేజ్‌తో తలపడ్డాడు. అయితే ఫేజ్ తన వద్ద ఉన్న తుపాకితో కలేకాను కాల్చి చంపాడు. తన ఆయుధం, బలం సరిపోవని తెలిసినప్పటికీ పేజ్‌ను నిలువరించడానికి కలేకా చేసిన కొద్ది క్షణాల ప్రయత్నం వల్ల మహిళలు, పిల్లలు కాల్పుల నుండి తప్పించుకోవడానికి వీలయింది. ఆ కాస్త సమయంలో పలువురు ఆ ఆవరణలో ఉన్న గదుల్లోకి వెళ్లి తలుపులు బిగించేసుకొని దాక్కున్నారు.

1982లో అమెరికా వచ్చిన కలేకా వ్యాపారవేత్తగా విజయం సాధించారు. ఆయన సంపాదన అంతా గురుద్వారా నిర్మాణానికే ఉపయోగించారు. గురుద్వారాలో ఆరుగురిని కాల్చి చంపిన పేజ్‌కు శ్వేతజాత్యాహంకార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని దర్యాఫ్తు అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో ఎఫ్‌బిఐ దర్యాఫ్తు చేస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కి ఫోన్ చేశారు.

ప్రార్థనాలయాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని హిల్లరీని కృష్ణ కోరారు. ఆమె సానుకూలంగా స్పందించారు. గురుద్వారాలో హత్యోదంతంతో కలత చెందానని అధ్యక్షుడు ఒబామా అన్నారు. మరోవైపు ఆరుగురు సిక్కులను హతమార్చడంపై హంతకుడు పేజ్ తల్లి లారా లిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చశారు. బాధితులకు క్షమాపణలు చెప్పారు. పేజ్ చిన్నప్పుడు ఎంతో మంచిగా మెదిలేవడాని, ఆప్తులను కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నానన్నారు. జరిగిన ఘటనకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. 12 ఏళ్లుగా పేజ్‌తో సంబంధాలు లేవని, తన కుమారుడి మరణ వార్త విని తన హృదయం ముక్కలైందన్నారు.

English summary
The 65-year-old head of the gurudwara in Oak Creek, Wisconsin, turned out to be an unlikely hero during Sunday’s shooting incident, as he confronted the white supremacist gunman with his ‘kirpan’ to save dozens of women, children and other worshippers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X