అమ్మాయిలతో అసభ్యంగా: గుడివద్ద దానం హల్‌చల్

ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ.. ఇస్కాన్ వాళ్లు అమ్మాయిలపై ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్కాన్ వాళ్లు ఆలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. వారు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అందుకే ఉండవద్దన్నారు. తాను ప్రజా ప్రతినిధిని అని, ప్రజల కోసం ఏమైనా చేస్తానని అన్నారు. భూమిని ఇస్కాన్ వాళ్లకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.
భూమి లీజును రద్దు చేయిస్తానని చెప్పారు. వాళ్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని, వారిపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు. తాను ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానన్నారు. తాను పోలీసులతోను, ఇస్కాన్ వాళ్లతోను దురుసుగా వ్యవహరించడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ కారణం అన్నారు. ప్రజల కోసం అవసరమైతే రూల్స్ బ్రేక్ చేస్తామన్నారు. లక్ష్మీ నరసింహ ఆలయాన్ని ఇస్కాన్ వాళ్లు కమర్షియల్ చేశారన్నారు. ఇక్కడ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తాను ఎవరి పైనా దాడి చేయలేదని స్పష్టం చేశారు.
ప్రజలకు రక్షణగా ఉండవల్సిన పోలీసులు వారి రిప్రజెంటేటివ్స్‌గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి పోతుందని ఇంట్లో కూర్చోనన్నారు. ఎస్ఐపై దుర్భాషాలాడారు. గురువారం ఉదయం మంత్రి తన అనుచరులతో వచ్చి గుడి గేటుకు తాళం వేశారు. దీంతో రెండు గంటలకు పైగా పలువురు భక్తులు, ఇరువురు పూజారులు లోపలే ఉండిపోయారు. కాగా ఈ వివాదం మూడ్రోజులుగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications