కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నేతలకు జగన్ పార్టీ గాలం: కాంగ్ నేతల మొగ్గు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు గాలం వేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలలో కెఈ సోదరులు ముఖ్యమైన వారు. జిల్లాలో వారికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో వారిని తమ పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వారు మాత్రం జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కర్నూలు జిల్లాలో జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులలో జగన్ పార్టీ భారీ మెజార్టీ సాధించింది. ఇప్పటికే జిల్లాలో సత్తా చాటుకున్న జగన్ పార్టీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను జిల్లాలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. అందులో భాగంగానే కెఈ బ్రదర్స్‌కు గాలం వేస్తున్నారని అంటున్నారు.

మరోవైపు జిల్లాలోని కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. వారిపై ఉప ఎన్నికల ప్రభావం బాగానే పడిందని అంటున్నారు. కాటసాని రామిరెడ్డి గతంలో జగన్ పార్టీ వైపు తొంగి చూసి మళ్లీ వెనక్కి వచ్చారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు జగన్ హవా నడుస్తుందని భావిస్తున్న పలువురు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారట.

English summary
It is said that YSR Congress party is trying for KE brothers to take in to their party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X