కిరణ్‌పై కెసిఆర్‌తో కలిసి కుట్ర: జైపాల్‌రెడ్డి, కెకెపై జగ్గారెడ్డి

జైపాల్ ఢిల్లీలో కూర్చొని డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు. మంత్రిగా ఉన్న అతను తెలంగాణ కోసం ఏనాడైనా, ఏమైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. అక్కడ కూర్చుని పుల్లలు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రానికి జైపాల్ చేసిన మంచి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు కిరణ్ పని చేస్తుంటే జైపాల్ మాత్రం పుల్లలు పెడుతున్నారన్నారు.
తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఎలా వస్తుందని ప్రశ్నించారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశాన్ని పక్కన పెట్టి, కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు సహకరించాల్సింది పోయి కిరణ్‌ను లక్ష్యంగా పెట్టుకోవద్దన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. 2014లో సిఎం కావాలనుకుంటున్న వారు కాంగ్రెసు పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అవుతామని ఎందుకు చెప్పటం లేదన్నారు. జైపాల్ డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు.
కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి అనర్హుడన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న కె కేశవ రావుపై కూడా జగ్గారెడ్డి మండిపడ్డారు. కెకె పిసిసి చీఫ్‌గా ఉన్నప్పుడు ఏనాడు తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు. అతనిపై తాను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పార్టీ నుండి కెకెను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications