రామోజీరావు భూముల మాటేమిటి?: జగన్ పార్టీ నేత

రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా.. వద్దా? సెజ్‌లు అవసరమా.. లేదా? అవి కావాలంటే ప్రభుత్వం భూములను కేటాయించాలా.. వద్దా? చంద్రబాబు స్పష్టంగా చెప్పాలన్నారు. వాన్‌పిక్ భూములను దున్నుతున్న బాబు అక్కడికే పరిమితమవుతారా? లేక ప్రభుత్వం పరిశ్రమలకు, సెజ్‌లకు కేటాయించిన భూములన్నింటినీ దున్నుతారా? రామోజీ ఫిలింసిటీ భూముల మాటేమిటని ప్రశ్నించారు. తన తొమ్మిదేళ్ల పరిపాలనలో పరిశ్రమలకు కేటాయించిన స్థలాలను బాబు ఏం చేస్తారన్నారు.
రామోజీ ఫిలిం సిటీకి రెండువేల ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించిన బాబు.. వాన్‌పిక్‌కు భూములను కేటాయించడాన్ని ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. ఈనాడు రామోజీరావు ఆనాడు గొర్రెల పెంపకం కోసం అని ఎకరా ఐదారు వేల రూపాయలకు కారుచౌకగా కొనుగోలు చేశారని, అప్పుడు తప్పుగా అనిపించనిది.. ఇప్పుడు వాన్‌పిక్ విషయంలోనే ఎందుకు తప్పుగా అనిపిస్తోందో చెప్పాలన్నారు.
బాబుకు వ్యవస్యాయం గురించి తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పుడు రైతు వేషం వేస్తే సరిపోదన్నారు. వాన్‌పిక్ సంస్థ తమ భూములను కొనుగోలు చేసినా.. వాటిని స్వాధీనం చేసుకునే వరకూ తమను వ్యవసాయం చేసుకోనిచ్చిందని.. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదనీ స్థానిక రైతులు చెబుతున్నా.. బాబు మాత్రం విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బాబుకు అధికారం లేక పూర్తిగా నిరాశా నిస్పృహల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు తన పరిపాలనలో తన బినామీలకు మేలు జరిగేలా నిజాం, పాలేరు షుగర్స్ వంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కారు చౌకగా అమ్మేశారని ఆరోపించారు.
మాల మాదిగల ఐక్యతను దెబ్బతీయడానికే చంద్రబాబు వర్గీకరణ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు వేరుగా ఆరోపించారు. ఇప్పటికైనా దళితులు ఐక్యంగా ముందుకు సాగుతూ రాజ్యాధికారాన్ని సాధించి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత దళితులపై మానసిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సుప్రీం కోర్టు వర్గీకరణను కొట్టివేసినప్పటికీ అదే అంశాన్ని మళ్లీ లేవనెత్తడం దుర్మార్గమన్నారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన మాల మృతవీరుల సంస్మరణ సభలో జూపూడి ప్రసంగించారు. లక్ష్మీపేట మారణకాండ విషయంలో పిసిసి చీఫ్ బొత్సపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని, జిల్లా మంత్రి, సిఎం కూడా బాధ్యులని జూపూడి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications