గీతిక ఆత్మహత్య: కందా ముందస్తు బెయిల్ దరఖాస్తు

ఇదిలా వుంటే, కందా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఎండిఎల్ఆర్ కార్యాలయానికి చెందిన మరో ముగ్గురుని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ పరాశర్. పరాశర్‌ను ప్రశ్నించడానికి పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. అరుణా చద్దా పోలీసు కస్టడీని మరో రోజు కోర్టు పొడిగించింది.
అజ్ఞాతంలోకి వెళ్లి కందా అజ్ఞాతంలోకి వెళ్లి గీతికతో తనకు గల సంబంధాలపై ఉన్న ప్రతి సాక్ష్యాన్ని తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గీతిక ఇ- మెయిల్ పాస్‌వర్డ్‌ను పోలీసులు ఇప్పటి వరకు సంపాదించలేకపోయారు. కాల్ రికార్డులను మాత్రం పొందారు. కందా గీతికకు పంపిన 400 పేజీల టెక్స్ట్ మెసేజ్‌ను వారు పరిశీలిస్తున్నారు. కందా ఇల్లు, ఫామ్‌హౌస్, కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లు మాయమయ్యాయి.
గీతిక ఇంటికి సమీపంలోలో అశోక్ విహార్‌లో కందాకు ఫ్లాట్ ఉందా, లేదా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అరుణ చద్దాను పలుమార్లు విచారించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమ ఎదుట హాజరవ్వాలని కందాకు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులు పంపించి రోజులు గడుస్తున్నా కందా నుండి ఎలాంటి స్పందన లేదు. అతను విచారణకు హాజరు కావడం లేదు. ఆదివారం గీతిక శర్మ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన సూసైడ్ నోట్‌లో కందా పేరు పేర్కొంది.












Click it and Unblock the Notifications